Share News

ఎంబీబీఎస్‌ సీటు సాధించిన హోంగార్డు కుమారుడు

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:37 PM

పాతపట్నం సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చక్క వాసు దేవరావు కుమారుడు శశిధర్‌నాయుడు ఎంబీబీఎస్‌ సీటు సాధించడంపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేసి అభినందించారు.

ఎంబీబీఎస్‌ సీటు సాధించిన హోంగార్డు కుమారుడు
శశిధర్‌ను అభినందిస్తున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చక్క వాసు దేవరావు కుమారుడు శశిధర్‌నాయుడు ఎంబీబీఎస్‌ సీటు సాధించడంపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేసి అభినందించారు. ఇటీవల నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విశాఖలోని ఎన్నారై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌లో ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. ఈ మేరకు శశిధర్‌ నాయుడు తల్లిదండ్రులతో మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ మాట్లాడుతూ హోం గార్డుల కుటుంబాల సంక్షేమం కోసం జిల్లా పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ వెంకట రమణ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:37 PM