Share News

వంశధార ప్రధాన ఎడమ కాలువకు రంధ్రం

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:05 AM

వంశధార ప్రధాన ఎడమ కాలువ టెక్కలి సమీ పాన 65.6వ కిలోమీటరు వద్ద లెఫ్ట్‌ బ్యాంక్‌ అండర్‌టర్నల్‌ సమీప గట్టుకు రంధ్రం ఏర్పడింది.

వంశధార ప్రధాన ఎడమ కాలువకు రంధ్రం
కాలువ గట్టుకు పడిన రంధ్రం

  • పూడ్చిన అధికారులు.. తప్పిన ముప్పు

టెక్కలి, జూలై 11(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రధాన ఎడమ కాలువ టెక్కలి సమీ పాన 65.6వ కిలోమీటరు వద్ద లెఫ్ట్‌ బ్యాంక్‌ అండర్‌టర్నల్‌ సమీప గట్టుకు రంధ్రం ఏర్పడింది. అయితే శుక్రవారం ఉదయం రంధ్రం వెంబడి నీరు వెళ్లడం గమనించిన రైతులు వంశధార అధికా రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడకు చేరు కొని రంధ్రం పూడ్చే పనిలో పడ్డారు. వంశధార ఈఈ బి.శేఖరరావు ఆధ్వ ర్యంలో యుద్ధ ప్రాతిపదికన ఎడమకాలువ గట్టుకు పడిన రంధ్రాన్ని పూడ్చడంతో ముప్పు తప్పింది. వంశధార కాలువ వెంబడి 584 క్యూసెక్కుల సాగునీరు ప్రవహిస్తుందని, సకాలంలో గుర్తిం చడం ద్వారా ప్రమాదం తప్పిందని ఈఈ తెలి పారు. ప్రస్తుతం మదనగోపాలసాగరంలోకి నీరు పూర్తిస్థాయిలో చేరిందని, శనివారం నాటికి పలాస పరిధిలో కాలువలకు సాగునీరు చేరుతుందని స్పష్టం చేశారు.

Updated Date - Jul 12 , 2025 | 12:05 AM