వంశధార నదిలో పడి హెచ్‌ఎం మృతి
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:00 AM
గోపాలపెంట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మార్పు నాగేశ్వరరావు(54) వంశధార నదిలో పడి మృతి చెందారు.
నరసన్నపేట, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గోపాలపెంట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మార్పు నాగేశ్వరరావు(54) వంశధార నదిలో పడి మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గోపాలపెంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏడాదిగా స్వగ్రామంలోనే హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. స్వంత పనులపై నాగే శ్వరరావు శుక్రవారం పాఠశాలకు సెలవు పెట్టారు. ఇంటి నుంచి స్నాన్నం కోసం శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో వంశధార నదికి వెళ్లి.. సాయంత్రం అయినా రాకపోవడంతో భార్య రమణమ్మ ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు నదితీరంలో గాలించగా ఒడ్డున నాగేశ్వరరావు బట్టలు ఉండడాన్ని గుర్తించారు. స్నానానికి దిగి నీటి ఉధృతికి గల్లంతై ఉండొచ్చ ని నిర్ధారించారు. ఈమేరకు కుటంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావు మృతదేహం కోసం శనివారం మధ్యాహ్నం వరకు మమ్మరంగా గాలింపు చేపట్టగా గోపాలపెంట వద్ద లోతైన ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ అసిరినాయుడు తెలిపారు. నాగేశ్వరరావుకి భార్యతోపాటు కుమారులు సునీల్, సుధీర్ ఉన్నారు. కాగా నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.