Share News

బుసలు కొడుతూ.. భయపెడుతూ

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:39 PM

మందస మండలంలోని భోగాపురంలో బుధవారం రాత్రి కింగ్‌కోబ్రా ఓ ఇంట్లోకి దూరి హల్‌చల్‌ చేసింది. సుమారు 12 అడుగుల పొడవుతో ఉన్న సర్పాన్ని గ్రామస్థులు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

బుసలు కొడుతూ.. భయపెడుతూ
పామును పట్టుకున్న స్నేక్‌స్నాచర్‌

హరిపురం ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని భోగాపురంలో బుధవారం రాత్రి కింగ్‌కోబ్రా ఓ ఇంట్లోకి దూరి హల్‌చల్‌ చేసింది. సుమారు 12 అడుగుల పొడవుతో ఉన్న సర్పాన్ని గ్రామస్థులు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.బుసలు కొడుతూ ఉన్న పాము ను ఇంట్లోనే తలుపులు వేసి ఎటూ పోకుండా చర్యలు తీసు కున్నారు.కొర్లాంకు చెందిన స్నేక్‌స్నాచర్‌ నర్సింగ్‌ మహాపా త్రోకు సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన చేరుకొని కింగ్‌కోబ్రాను పట్టుకున్నాడు.అనంతరం సమీపంలోని కొండల్లోకి విడిచిపెట్టడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:39 PM