Share News

హైటెక్‌ హరిదాసులు

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:14 AM

గతంలో హరిదాసులు ఒక చేతితో తుంబుర మీటుతూ.. మరో చేతితో చిడతల సవ్వడి చేస్తూ, కాలితో గజ్జెలను మోగిస్తూ.. హరినామ సంకీర్తనలను ఆలపిస్తూ గ్రామాల్లో సందడి చేసేవారు.

 హైటెక్‌ హరిదాసులు
వరహాలమ్మపేటలో ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న హరిదాస్‌

కోటబొమ్మాళి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గతంలో హరిదాసులు ఒక చేతితో తుంబుర మీటుతూ.. మరో చేతితో చిడతల సవ్వడి చేస్తూ, కాలితో గజ్జెలను మోగిస్తూ.. హరినామ సంకీర్తనలను ఆలపిస్తూ గ్రామాల్లో సందడి చేసేవారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా మారారు. ద్విచక్ర వాహనాలపై గ్రామాలకు వచ్చి తిరుగుతున్నారు. బైక్‌కు అక్షయ పాత్ర, చిన్న సౌండ్‌ బాక్స్‌ను అతికించి తమ ఫోన్లలో రికార్డు చేసిన హరినామ కీర్తలను బ్లూటూత్‌ సాయంతో వినిపిస్తున్నారు. వీరిని గ్రామాల్లో వింతగా చూస్తున్నారు. హైటెక్‌ హరిదాసులంటూ కొందరు అంటున్నారు. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు, ఊడికలపాడు, లఖందిడ్డి, ఎత్తురాళ్లుపాడు, పొడుగుపాడు, సౌడాం తదితర గ్రామాల్లో బుధవారం కొందరు హరిదాసులు ఇలా మోటారు సైకిళ్లపై గ్రామాల్లో తిరగడం కనిపించింది.

Updated Date - Dec 25 , 2025 | 12:14 AM