ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి
ABN , Publish Date - May 15 , 2025 | 11:22 PM
: ప్రకృతి వ్యవసాయ సాగు విధానం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్‌చార్జి బి. సీతారామయ్య తెలిపారు. గురువారం మడపాంలో ప్రకృతి వ్యవసాయం సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేయవచ్చనన్నారు.
నరసన్నపేట, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయ సాగు విధానం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్‌చార్జి బి. సీతారామయ్య తెలిపారు. గురువారం మడపాంలో ప్రకృతి వ్యవసాయం సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేయవచ్చనన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరి, డి.లీలావతి, సింహాద్రి, కమలమ్మ పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
నందిగాం, మే 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని రౌతుపురంలో ప్రకృతి వ్యవసా యంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది లోకేష్, గోవింద్ ప్రకృతివ్యవసాయం ఆవశ్యకత, నవధా న్యాలు సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, ఏ-గ్రేడ్ మోడల్ కిచెన్ గార్డెన్ తదితర అంశాలపై వివరించారు.కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారి వజ్జ గోపాలకృష్ణ, సిబ్బం ది, రైతులు పాల్గొన్నారు.