ఆదిత్యుడ్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:07 AM
arasavalli temple ప్రత్యక్షదైవం.. అరసవల్లిలోని ఆదిత్యుడ్ని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్ దంపతులు, జస్టిస్ విశాల్ ధగాట్ దంపతులు శనివారం దర్శించుకున్నారు.
అరసవల్లి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం.. అరసవల్లిలోని ఆదిత్యుడ్ని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్ దంపతులు, జస్టిస్ విశాల్ ధగాట్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. వారికి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. అనివెట్టి మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేశారు. స్వామి ప్రసాదాలు, జ్ఞాపికలను ఈవో కెఎన్‌విడివి.ప్రసాద్ అందజేశారు. కార్యక్రమంలో నేతింటి హరిబాబు, ఇప్పిలి సందీపశర్మ, పార్థసారధి, బాల భాస్కర సాయి పాల్గొన్నారు.