స్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:01 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల శనివారం జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం దేవాలయాలను దర్శించుకున్నారు.
అరసవల్లి/గార/జలుమూరు అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల శనివారం జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం దేవాలయాలను దర్శించుకున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీకూర్మం కూర్మనాథ స్వామి ఆలయంలో ఈవో నరసింహ నాయుడు, ప్రధాన అర్చ కులు సీతారామ నరసింహాచార్యులు స్వాగతం పలికారు. శ్రీముఖలింగం లోని ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం వారి గోత్రనామాలతో స్వామికి అర్చకులు విశేష పూజలు చేశారు. న్యాయమూర్తులకు అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి వారి ప్రసాదం, చిత్రపటాలను అందించారు. కార్యక్రమంలో పాతపట్నం, నరసన్నపేట జూనియర్ సివిల్ న్యాయాధి కారులు ఎం.రోషిణి, ఎస్.వాణి తదితరులు పాల్గొన్నారు.