ఆదిత్యుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:25 AM
అరస వల్లి సూర్యనారాయణ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహీన్ కుమార్ గేదెల దంపతులు సోమవారం దర్శించుకున్నారు.
అరసవల్లి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): అరస వల్లి సూర్యనారాయణ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహీన్ కుమార్ గేదెల దంపతులు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శం కరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ ఈవో ప్రసాద్ వారికి అందజేశారు. కార్యక్రమంలో ఇప్పిలి షణ్ముఖశర్మ, నేతింటి హరిబాబు, ఇప్పిలి రంజిత్ శర్మ, రామకృష్ణ శర్మ, సాంబ మూర్తి, వికాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.