Share News

శ్రీకూర్మనాఽథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:57 PM

High Court Judge శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి, జస్టిస్‌ రవినాఽథ్‌ తిలహరి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

శ్రీకూర్మనాఽథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ రవినాథ్‌ తిలహరిని ఆశీర్వదిస్తున్న వేద పండితులు

గార, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి, జస్టిస్‌ రవినాఽథ్‌ తిలహరి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో తాబేళ్ల పార్క్‌, శ్వేతపుష్కరిణి పరిశీలించారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, వేద పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్ర, ప్రాధాన్యతను అర్చకులు వివరించారు. జస్టిస్‌ రవినాఽథ్‌ తిలహరికి స్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఈవో టి.వాసుదేవరావు, అర్చకులు సీతారామ నరసింహాచార్యులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.అనురాగ్‌, ప్రోటోకాల్‌ ఇన్‌చార్జి బి.నాగభూషణం తదితరులున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:57 PM