Share News

ఆదిత్యుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:35 PM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదిత్యుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
హైకోర్టు న్యాయమూర్తికి జ్ఞాపికను అందిస్తున్న ఈవో

అరసవల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చ కులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదం, జ్ఞాపిక ను ఈవో కేఎన్‌వీఈడీవీ ప్రసాద్‌ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, అర్చకులు ఇప్పిలి సాందీప శర్మ, రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యుడి ఆదాయం రూ.2.26 లక్షలు

అరసవల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామికి ఆదివారం రూ.2,26,871 ఆదాయం లభించింది. ఆదివారం పోలేల అమావాస్య కావడంతో సాధారణ స్థాయిలోనే భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. ఆదివారం టిక్కెట్ల ద్వారా రూ. 55,000, విరాళాలు రూ.42,906, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 1,28,965 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 11:35 PM