రిటైరైన వారికి సాయం మంచి సంప్రదాయం: ఎస్పీ
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:45 PM
పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి రిటైర్ అయిన ఉద్యోగులకు సహచరులు ఆర్థిక సాయం చేయడం మంచి సంప్రదాయమ ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి రిటైర్ అయిన ఉద్యోగులకు సహచరులు ఆర్థిక సాయం చేయడం మంచి సంప్రదాయమ ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. హోంగార్డు ఎల్‌వీఆర్ మూర్తి పదవీ విరమణ చేయగా సహచర ఉద్యోగులు స్వచ్ఛం దంగా సుమారు రూ.4.08 లక్షలను సమకూర్చారు. ఈ చెక్కు ను ఎస్పీ శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటివి పోలీస్ సిబ్బందిలో ఐక్యతను, మానవతా విలువ లను ప్రతిబింబిస్తాయన్నారు. ఉద్యోగ విర మణ అనంతరం ఆరోగ్యంపై దృష్టి పెట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం ఏవో గోపీనాథ్, ఆర్‌ఎస్‌ఐ వెంకటరమణ పాల్గొన్నారు.