Rain: సిక్కోలులో భారీ వర్షం
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:33 PM
Flood Alert at srikakulam శ్రీకాకుళంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో కాలువలు పొంగి.. రహదారిపై మురు గునీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

మురుగునీటితో పొంగిపొర్లుతున్న కాలువలు
జలమయమైన ఆర్టీసీ కాంప్లెక్స్
అరసవల్లి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో కాలువలు పొంగి.. రహదారిపై మురు గునీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాపరిషత్ కార్యాలయం, పాతబస్టాండు, చిన్నబరాటం రోడ్డు తదితర ప్రాంతాల్లో మురుగునీరు రోడ్డుపై నిలిచి పోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా జలమయమై పోయింది. విశాఖ నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది కూడా నీటిలోనే తమ విధులను నిర్వర్తించారు.