పీపీపీ పద్ధతి వల్ల వైద్యం ప్రైవేటు పరం
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:55 PM
పీపీపీ (పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతి వల్ల ప్రభుత్వ వైద్యరంగం ప్రైవేట్ గుప్పెట్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కామేశ్వరరావు అన్నారు.
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కామేశ్వరరావు
అరసవల్లి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): పీపీపీ (పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతి వల్ల ప్రభుత్వ వైద్యరంగం ప్రైవేట్ గుప్పెట్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కామేశ్వరరావు అన్నారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ప్రజారోగ్య వేదిక, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ మల్లేశ్వరరావు అధ్యక్షతన శనివా రం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ప్రతీ పార్లమెంటు నియోజక వర్గానికి ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశ్యంతో మన రాష్ట్రానికి 17 కళాశాలలు మంజూరు చేస్తే, గత వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల లో కేవలం ఐదు కళాశాలలను మాత్రమే అరకొరగా పూర్తిచేసిందన్నా రు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ.8548 కోట్లలో రూ.2225 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని విమర్శించారు. నేటి కూటమి నేతలు ఆనాడు ఈ పద్ధతిని విమర్శించి, నేడు అదే విధానాన్ని కొనసాగిస్తున్నా రని, దీంతో కన్వీనర్ కోటా సీట్లు తగ్గి, పేద, సామాన్య, మధ్య తరగతి వారు వైద్యవిద్యకు దూరమైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజుల పద్ధతిని రద్దు చేసి, నిర్వహణను పూర్తి గా చేపట్టాలన్నారు. సమావేశంలో నాయకులు ప్రభాక రరావు, నాయకులు వాసుదేవరావు, చందు, రాజు, రమణ, గోవర్థన రావు, రమణారావు, ఆదినారాయణమూర్తి, సాయిప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు.