Share News

క్రీడలతో ఆరోగ్యం

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:01 AM

క్రీడలు మానసి క, శరీర ఆరోగ్య పరిరక్షణ సాధ నాలని ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు (ఎంజీ ఆర్‌) అన్నారు.

క్రీడలతో ఆరోగ్యం
క్రీడాజ్యోతి వెలిగిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

  • ఎమ్మెల్యే ఎంజీఆర్‌

పాతపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసి క, శరీర ఆరోగ్య పరిరక్షణ సాధ నాలని ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు (ఎంజీ ఆర్‌) అన్నారు. స్థానిక గిరిజన సామాజిక భవన ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన 69వ ఏపీ అంతర్రాష్ట్ర సాఫ్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌-2025 పోటీ లను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ క్రీడాపతాకాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రా ష్ట్రంలోని 11 జిల్లాలకు చెందిన సుమారు 500మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు రాష్ట్రబాధ్యులు ఎన్ని శేఖర్‌బాబు తెలిపారు. క్రీడకారులకు అండర్‌-14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు వేర్వేరుగా నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలు వచ్చే నెలలో నిర్వహించనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ.. గెలుపు ఓటమిలను సమానంగా తీసుకొనే క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు బండి రవివర్మ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అడ్వైజరీ సభ్యులు పి.సుందరరావు, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుడు పి.తవిటయ్య కార్యదర్శి ఎంవీ రమణ, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:03 AM