Share News

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం: అశోక్‌

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:49 PM

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం పెంపొందుతుందని, ఈ దిశలో ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఎమ్మెల్యే, విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం: అశోక్‌
జీడి మొక్కలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

సోంపేట, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం పెంపొందుతుందని, ఈ దిశలో ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఎమ్మెల్యే, విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. వ్యవ సాయశాఖ భవనంలో గురువారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులకు జీడి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ టి.భవా నీశంకర్‌, ఏవో బి.నరసింహ మూర్తి, ఉద్యానవన శాఖాధికారి పి.మాధవీలత, టీడీపీ రాష్ట్రకార్యదర్శి సూరాడ చంద్ర మోహన్‌, పార్టీ మండల అఽధ్యక్షుడు ముడ్డు కుమార్‌, నాయకులు చిత్రాడ శ్రీనివాసరావు, మద్దిల నాగేశ్వరరావు, బీన ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:49 PM