హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:34 PM
హెల్త్ సెక్రటరీలకు ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలని ఏపీ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
అరసవల్లి, నవంబరు 26(ఆంధ్ర జ్యోతి): హెల్త్ సెక్రటరీలకు ఏఎన్ ఎంలుగా పదోన్నతులు కల్పించాలని ఏపీ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసి యేషన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యా లయ ఆవరణలో బుధవారం వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ.. గత ఏడాది నవంబరులో పదోన్నతుల జీవోను ప్రభుత్వం జారీ చేసిందని, కాని శ్రీకాకుళం జిల్లాలోనే ఇంతవరకు పదో న్నతులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా పదోన్నతులు ఇంతవరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 150 ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బి.మురళి, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూని యన్ ప్రఽధాన కార్యదర్శి డి.సాయి ప్రసాద్, అసోసియేషన్ అధ్య క్షురాలు డి.ఝాన్సీ, నేతలు పద్మ ప్రియ, మాధవి, అరుణ, రమ, చిన్ని, హేమలత, జీవిత పాల్గొన్నారు.