‘ఆరోగ్య బీమా’ పేదలకు వరం
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:59 PM
ఆరోగ్య బీమా ద్వారా పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అం దించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి/టెక్కలి, సెప్టెంబరు 7(ఆంధ్ర జ్యోతి): ఆరోగ్య బీమా ద్వారా పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అం దించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఆదివారం మండలం నిమ్మాడ తన క్యాంపు కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2,69,748 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాల మేలు చేస్తుందన్నారు.
ఏఎంసీ సభ్యులకు అభినందన
టెక్కలి ఏఎంసీ చైర్మన్‌గా నియమితులైన బగాది శేషగిరి, ఉపాధ్యక్షుడు బాడాన రమణమ్మ తో పాటు పలువురు డైరెక్టర్లను మంత్రి అచ్చెన్నా యుడు అభినందించారు. వారంతా ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రైతుల సేవ ల్లో ముందువరుసలో కమిటీ సభ్యులు ఉం డాలన్నారు. వీరితోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, నాయకులు పినకాన అజ య్‌కుమార్, తర్ర రామ కృష్ణ, బాలకృష్ణ, కింగ్, గండి సూర్యనారాయణ రెడ్డి, రాము, కామేసు, షన్ముఖరావు తదితరులు ఉన్నారు.