యోగా సాధనతోనే ఆరోగ్యం: వీసీ
ABN , Publish Date - May 28 , 2025 | 12:02 AM
యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని తెలిపారు. మంగళవారం వర్సిటీలోని యోగా, ఫిట్‌నెస్ విభాగం ఆధ్వర్యంలో యోగాం ధ్ర -2025లో భాగంగా యోగా విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత, వర్సిటీ ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, ఎస్.ఉదయ భాస్కర్, సీహెచ్.రాజశేఖరరావు, ఎస్‌వో ఎస్.సామ్రాజ్యలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డి.వనజ, యోగా విభాగం కోఆర్డినేటర్ కేవీఎన్ మూర్తి పాల్గొన్నారు.
ఎచ్చెర్ల, మే 27(ఆంధ్రజ్యోతి): యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని తెలిపారు. మంగళవారం వర్సిటీలోని యోగా, ఫిట్‌నెస్ విభాగం ఆధ్వర్యంలో యోగాం ధ్ర -2025లో భాగంగా యోగా విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత, వర్సిటీ ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, ఎస్.ఉదయ భాస్కర్, సీహెచ్.రాజశేఖరరావు, ఎస్‌వో ఎస్.సామ్రాజ్యలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డి.వనజ, యోగా విభాగం కోఆర్డినేటర్ కేవీఎన్ మూర్తి పాల్గొన్నారు.
ఫసరుబుజ్జిలి, మే27(ఆంధ్రజ్యోతి):రొట్టవలస జడ్పీఉన్నతపాఠశాల ఆవరణలో యోగా మాసోత్సవాల మండల స్థాయి కార్యక్రమం మంగళవారం నిర్వహిం చారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.పావని, ఈవో పీఆర్డీ రామారావు, ఏవో వరప్రసాద్, ఆయుర్వేద వైద్యాధికారి పూజారి పురుషోత్తమరావు పాల్గొన్నారు.
ఫకవిటి, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రతిరోజూ యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారని ఎంపీ డీవో వి.విశ్శేశ్వరరావు తెలిపారు. కవిటి మండలపరిషత్ కార్యాలయం వద్ద యోగాంద్ర మాసోత్సవాల్లో భాగంగా అధికారులు యోగాసనాలువేశారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు ఎస్.జయసూర్య పాల్గొన్నారు.
ఫపొందూరు, మే 27 (ఆంధ్రజ్యోతి): నిత్యం యోగా సాధనతో దీర్గకాలరోగాలకు పరిష్కారం దొరుకు తుందని తహసీల్దార్ ఆర్. వెంకటేష్, ఎంపీడీవో ఎం. మన్మఽథరావు తెలిపారు.పొందూరు మార్కెట్‌కమిటీలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో పి. రాజా రావు, ఏపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.