Share News

అనారోగ్యంతో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:51 PM

మం డలంలోని చింతలబడవంజ గ్రామానికి చెందిన ఏపీఎస్పీ హెడ్‌కానిస్టేబుల్‌ పనస గౌరినాయుడు(47) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు.

 అనారోగ్యంతో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి
గౌరినాయుడు(ఫైల్‌)

ఎల్‌.ఎన్‌.పేట, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): మం డలంలోని చింతలబడవంజ గ్రామానికి చెందిన ఏపీఎస్పీ హెడ్‌కానిస్టేబుల్‌ పనస గౌరినాయుడు(47) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. గౌరినాయుడు విజయనగ రంలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. నాలుగురోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్ప త్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. స్వగ్రామం చింతలబడవంజలో అంత్యక్రియలు నిర్వహించారు. గౌరినాయుడుకు భార్య భవాని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో జరిగే దైవ కార్యక్రమాలు, శుభకార్యాలకు వచ్చిపోతూ తమతో సరదాగా ఉండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Jun 01 , 2025 | 11:51 PM