ప్రేమించాడు.. పెళ్లికి నిరాకరించాడు..
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:26 AM
తనను ఓ వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని పలాస పట్టణ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు చేసినట్టు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు.
పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి
పలాస, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తనను ఓ వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని పలాస పట్టణ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు చేసినట్టు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఓ జీడి పరిశ్రమలో గుమస్తాగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన జె.రమేష్, అదే పరిశ్రమలో పనిచేస్తున్న యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత ఆరేళ్లు గా విశాఖ, విజయనగరం, పర్లాకిమిడి తదితర ప్రాంతాల్లో తిప్పి, అన్నివిధాలుగా వాడుకున్నాడు. చివరకు పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కాదు పొమ్మంటున్నాడు. ఇప్పుడు తనని కాదని వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో అతడికి ఫోన్ చేయగా, నిన్ను పెళ్లిచేసుకోలేనని చెప్పి, ఆయన తల్లితో కూడా మాట్లాడించి అసభ్యకరమైన పదజాలంతో తిట్టిం చాడు. దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.
మోసగించిన వ్యక్తిపై కేసు
శ్రీకాకుళం రూరల్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండ లానికి చెందిన ఓ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేసి నట్టు రూరల్ ఎస్‌ఐ కె.రాము తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విద్యార్థిని తాతగారి వద్ద నరస న్నపేటలో ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆ సమయంలో ముసిడిగట్టుకు చెందిన సబ్బి సింహాద్రితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసు కుంటానని హామీ ఇచ్చి ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లికి నిరాకరించాడు. మోసపోయానని భావించిన ఆమె రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సింహాద్రి అసోం రైఫిల్స్‌లో పనిచేస్తున్నాడు.