Share News

సెల్‌ఫోన్‌ వాడడు.. గుర్తింపు కార్డు ఉండదు

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:51 PM

'Most wanted' thief arrested సెల్‌ఫోన్‌, గుర్తింపు కార్డు లేకుండా వరుస చోరీలకు పాల్పడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌వాం టెడ్‌ గజదొంగగా పేరొందిన దున్న కృష్ణ ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు నెలల కిందట శ్రీకాకుళం మండలంలో చోరీకి పాల్పడిన కృష్ణ.. కోల్‌కత్తా నుంచి మరో చోరీ చేపట్టేందుకు శ్రీకాకుళం వచ్చి పోలీసులకు చిక్కాడు.

సెల్‌ఫోన్‌ వాడడు.. గుర్తింపు కార్డు ఉండదు
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, పోలీసుల అదుపులో నిందితులు

చాకచక్యంగా తాళాలు పగులగొట్టేస్తాడు

ఇప్పటివరకు 218 చోరీలు...

తెలుగు రాష్ట్రాల్లోనే ‘మోస్ట్‌వాంటెడ్‌’ గజదొంగ దున్న కృష్ణ అరెస్ట్‌

కోల్‌కత్తా నుంచి వచ్చి దొంగతనం చేసి.. ఉడాయింపు

ఎట్టకేలకు పట్టుకున్న రూరల్‌ పోలీసులు

శ్రీకాకుళం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌, గుర్తింపు కార్డు లేకుండా వరుస చోరీలకు పాల్పడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌వాం టెడ్‌ గజదొంగగా పేరొందిన దున్న కృష్ణ ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు నెలల కిందట శ్రీకాకుళం మండలంలో చోరీకి పాల్పడిన కృష్ణ.. కోల్‌కత్తా నుంచి మరో చోరీ చేపట్టేందుకు శ్రీకాకుళం వచ్చి పోలీసులకు చిక్కాడు. కృష్ణతోపాటు చోరీల్లో ఆయనకు సహకరించిన సయ్యద్‌ రఫీని కూడా అరెస్టు చేశా రు. వారి నుంచి రూ.33,25,539 విలువైన బంగారం, వెండి ఆభర ణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం శ్రీకాకుళం లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన దున్న కృష్ణ దొంగతనాలకు అలవాటుపడి.. జైలుకు వెళ్లి వస్తూ.. మళ్లీ చోరీలకు పాల్పడుతుండేవాడు. తెలుగురాష్ట్రాల్లో 218 చోరీలకు పాల్పడి.. ఏకం గా ఇప్పటివరకు 50 కిలోల బంగారం, 300 కిలోల వెండి ఆభర ణా లను, ఒక కిలో ప్లాటినం వస్తువులను చోరీ చేసినట్లు పోలీసు రికా ర్డుల్లో ఉంది. ఇప్పటికే 60 చోరీ కేసులకు సంబంధించి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా దొంగతనాలను ఆపలేదు. కొన్నాళ్ల కిందట జైలు లో శ్రీకాకుళం నగరం గూనపాలెం ప్రాంతానికి చెందిన సయ్యద్‌ రఫీతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చోరీ సొత్తును సయ్యద్‌ రఫీతో బయట విక్రయించేవాడు. శ్రీకాకుళం రూరల్‌ స్టేషన్‌లో 14 కేసులు, శ్రీకాకుళం టూటౌన్‌లో 3 కేసులు, వన్‌టౌన్‌లో 1 కేసు నమోదైంది. రెండు నెలల కిందట శ్రీకాకుళం ఎస్‌బీఐ స్టాఫ్‌ కాలనీలో ఎతురాజుల భవానీ ఇంట్లో వెండి ఆభరణాలను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేశారు. అప్పటినుంచి కృష్ణ కోసం పోలీసులు గాలిం చారు. ఇటీవల శ్రీకాకుళం మండలం ఒప్పంగి గ్రామంలో మరో చోరీ కోసం కోల్‌కత్తా నుంచి వచ్చిన కృష్ణను నిఘా బృందంతో పట్టుకుని విచారణ చేపట్టారు. శ్రీకాకుళంలో సయ్యద్‌ రఫీతోపాటు.. కోల్‌కత్తాలో అంతన్షఫుల్‌, తరున్‌మండల్‌ అనే ఇద్దరి వ్యక్తుల ద్వారా చోరీ సొత్తును విక్రయించేవాడినని అంగీకరించాడు. దున్న కృష్ణ నుంచి రూ.33,25,539 బంగారం, వెండి ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణతోపాటు సయ్యద్‌ రఫీని కూడా అరెస్ట్‌ చేశామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మోస్ట్‌వాంటెడ్‌ గజదొంగ దున్న కృష్ణ చోరీలు చాకచక్యంగా నిర్వహిస్తాడని.. సెల్‌ఫోన్‌ వినియోగించడని, ఎటువంటి ఐడీ కార్డు కూడా అతని వద్ద ఉండదన్నారు. తమ విచారణలో శ్రీకాకుళంలో 18 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. గజదొంగను పట్టుకున్న ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు పైడాపునాయుడు, చంద్రమౌళి, ఎస్సైలు రాజేష్‌, గణేష్‌, రాము, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Nov 22 , 2025 | 11:51 PM