ఆత్మహత్య కేసులో హెచ్‌సీ అరెస్టు
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:29 AM
దేవుపురం పంచాయతీ తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంకటరావు(33) ఆత్మహత్య కేసులో ఇద్దరికి రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ సోమవారం తెలిపారు.
బంకు యజమానితోపాటు 15 రోజులు రిమాండ్
నందిగాం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): దేవుపురం పంచాయతీ తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంకటరావు(33) ఆత్మహత్య కేసులో ఇద్దరికి రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. వెంకటరావు వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో గల ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బంకు యజమాని బగాది రమేష్ నుంచి రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చమని రమేష్ వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై వెంకటరావు ఈ నెల 8న గ్రామ సమీపంలోని ఓ తోటలో చెట్టుకు ఉరివేసుకుని వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై వెంకటరావు భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటరావును వేధింపులకు గురిచేసిన పెట్రోల్ బంకు యజమాని రమేష్‌తో పాటు అతడికి సహకరించిన వజ్రపుకొత్తూరు పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కోరాడ ఈశ్వరరావులను అరెస్టు చేశారు. వారిని పలాస కోర్టులో ఆదివారం రాత్రి హాజరుపరచగా.. న్యాయాధికారి మాధురి 15రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిద్దరిని నరసన్నపేట సబ్‌జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.