మహిళల్లో ఆనందం
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:06 AM
స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీశక్తి పథకం ప్రారంభం
ఉచిత బస్సు ప్రయాణంపై హర్షం
స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నాయకులు ఆయా ప్రాంతాల్లో ప్రారంభించారు. మహిళలతో కలిసి కొంత దూరం ప్రయాణించి ఉత్సాహపరిచారు. ఈ పథకం ప్రారంభించడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
మహిళా పక్షపాతి చంద్రబాబు
ఆమదాలవలస, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతి అని మాజీ ఎంపీపీ, ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మొదలవలస రమేష్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్, పీఏసీఎస్ అధ్యక్షురాలు శిమ్మ మాధవి, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఉచిత బస్ సర్వీసు ప్రారంభం
కవిటి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచి త ప్రయాణ సదుపాయం క ల్పించిందని ఎమ్మెల్యే, విప్ బి.అశోక్ అన్నారు. బస్టాండ్ లో మహిళలను బస్ సర్వీ సును ప్రారంభించారు. పథ కాలు అమలు చేస్తుంటే చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి మహిళలే తగిన బుద్ధి చెప్పాలన్నారు.
రణస్థలంలో ఎంపీ, ఎమ్మెల్యే..
రణస్థలం, ఆగస్టు 15(ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్ర వారం ప్రారంభించారు. ఎంపీడీవో కా ర్యాలయం నుంచి ఎర్రన్నాయుడు విగ్ర హం వరకు మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ బస్సును డ్రైవ్ చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ అవినాష్, కూటమి నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, విశ్వక్షేన్, పిసిని జగన్నాథంనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు బస్సును నడపడం విశేషం
అడగకుండా వరాలిచ్చే నాయకుడు చంద్రబాబు
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): అడగకుండానే మ హిళలకు వరాలిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే గౌతు శిరీ ష అన్నారు. శుక్రవా రం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాం ప్లెక్స్‌లో బుస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకా న్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో మహిళలతో కలసి ప్రయాణించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వజ్జ గంగా భవాని, జోగ త్రివేణి, కమల, వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, మల్లా శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్ గుప్తా, దువ్వాడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారితే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామి డి గోవిందరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్త్రీశక్తి పథకం పేరిట ప్రభుత్వం చేపట్టిన ఆర్టీసీ బస్సుల్లో మ హిళలకు ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొరసవాడ వరకూ మహిళ లతో కలిసి ప్రయాణిం చారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎప్పుడూ అనుకోలేదు
ఆర్టీసీ బస్సులో ఇలా ఉచితంగా ప్ర యణం చేస్తానని తానెప్పుడు అనుకోలేదు. కూటమి ప్రభుత్వ పుణ్యమాని ఎంతో సంతోషంగా ఉంది.
- ఎల్.అప్పలమ్మ బూరగాం
స్త్రీశక్తి పథకం మహిళలకు వరం
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పథకం మహిళలకు వరం అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిం చారు. కార్యక్రమంలో నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి బగ్గు అర్చన, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆసరాగా ఉంటుంది
స్ర్తీశక్తి పథకం మహిళలకు ఆసరా నిలిస్తుంది. సీఎం చంద్రబాబు మహిళలు పక్షపాతి అని రుజువు అయింది.
- పుచ్చల కల్పన, నరసన్నపేట