Share News

Free bus service: ‘స్ర్తీ శక్తి’పై మహిళల్లో ఆనందం

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:45 PM

Free bus.. ladies happy ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్ర్తీ శక్తి పథకంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో.. జిల్లాలో రోజుకు సుమారు 62వేల మంది దీనిని వినియోగించుకుంటున్నార’ని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ, ఒకటో డిపో మేనేజర్‌ అమరసింహుడు తెలిపారు.

Free bus service: ‘స్ర్తీ శక్తి’పై మహిళల్లో ఆనందం
ఉచిత బస్సు ప్రయాణంపై మహిళతో ఆరా తీస్తున్న డీపీటీవో అప్పలనారాయణ

  • బస్సుల్లో రోజూ 62 మంది ఉచిత ప్రయాణం

  • జిల్లా ప్రజారవాణా అధికారి అప్పలనారాయణ

  • అరసవల్లి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్ర్తీ శక్తి పథకంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో.. జిల్లాలో రోజుకు సుమారు 62వేల మంది దీనిని వినియోగించుకుంటున్నార’ని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ, ఒకటో డిపో మేనేజర్‌ అమరసింహుడు తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళలతో వారు మాట్లాడారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుపై ఆరా తీయగా మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగరీత్యా బస్సుల్లో రోజూ ప్రయాణిస్తున్నామని, ఉచితం కావడంతో నెలకు రూ.10వేల వరకు మిగిలే అవకాశం ఉందని ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పారు. మరికొందరు మహిళలు మాట్లాడుతూ.. బస్సుల్లో రద్దీ పెరిగిందని, ప్రత్యేక పర్వదినాల్లో అదనపు బస్సులు నడపాలని కోరారు. ఇదిలా ఉండగా ‘విశాఖపట్నం, విజయనగరం, బత్తిలి, పాలకొండ, ఇచ్ఛాపురం మార్గాల్లో మహిళలు అధికంగా ప్రయాణిస్తున్నారు. గతంలో జిల్లాకు ఆక్యుపెన్సీ రేటు 72శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు 93 శాతానికి పెరిగింది’ అని జిల్లా ప్రజారవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. విద్యుత్‌ బస్సులు వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 11:45 PM