Share News

వేడుకగా హనుమాన్‌ జలయాత్ర

ABN , Publish Date - May 27 , 2025 | 12:16 AM

స్థానిక గొల్లవీధి సమీపంలో గల సత్యసాయి మందిరం ప క్కన నూతనంగా నిర్మిం చిన ధ్యానాంజనేయ స్వా మి విగ్రహ ప్రతిష్ఠ మ హోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

వేడుకగా హనుమాన్‌ జలయాత్ర
నది ఒడ్డున ప్రార్థనలు

ఇచ్ఛాపురం, మే 26(ఆంధ్రజ్యోతి): స్థానిక గొల్లవీధి సమీపంలో గల సత్యసాయి మందిరం ప క్కన నూతనంగా నిర్మిం చిన ధ్యానాంజనేయ స్వా మి విగ్రహ ప్రతిష్ఠ మ హోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో జలయాత్రను ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం సుమారు 500 మంది మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి... బాహుదా నది వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. నదీ తీరాన దాసరి నారాయణరావు దంపతులతో పాటు తొమ్మి ది జంటలతో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిందెలతో నదీ జలా లను పట్టుకొని మహిళలు కాలినడకన విగ్రహం వద్దకు చేరుకున్నారు. మంగళవారం నదీ జలాలతో స్వామికి అభిషేకం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - May 27 , 2025 | 12:16 AM