అరగంట వర్షం.. నగరం జలమయం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:54 PM
బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు రోజు లుగా ప్రతిరోజు సాయంత్రం కొద్దిసేపు వర్షం కురుస్తోంది.
శ్రీకాకుళం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు రోజు లుగా ప్రతిరోజు సాయంత్రం కొద్దిసేపు వర్షం కురుస్తోంది. వాతావరణంలో కూడా మార్పులు సంభవించాయి. గురు వారం సాయంత్రం అర్ధగంట పాటు భారీ వర్షం కురిసింది. నగరంలో ఈ వర్షానికే ప్రజలు గంటపాటు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా అంతటా వర్షపాతం నమోదైంది. నగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు పలు వీధులు జలమయ మ య్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉప్పొంగిన పెద్దగెడ్డ
-రాకపోకలకు అంతరాయం
లావేరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అదపాక, బుడుమూరు మీదుగా ఉన్న పెద్దగెడ్డ గురువారం పొంగి ప్రవహించడంతో గుర్రాల పాలెం, పాత, కొత్తకుంకాలు, పెద కొత్తపల్లి, పైడాయవలస, ఎల్‌ఎన్ పురం, ఇజ్జుపేట తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంత రాయం కలిగింది. బుధ, గురువారా ల్లో చీపురుపల్లి, గరివిడి, ఆకుల ములగాం తదితర ప్రాంతాల్లో భారీ గా వర్షం కుర వడంతో గెడ్డ ప్రవాహం అధికమైంది. అదపాక- గుర్రాల పాలెం మార్గంలో వంతెనపైనుంచి నీరు ప్రవహించింది. గుర్రాలపాలెం నుంచి అదపాక వెళ్లే వారిని కొంతమంది యువకులు గెడ్డను దాటించారు. అద పాక గెడ్డ వద్ద వంతెనను నిర్మించాలని వారు కోరుతున్నారు.