జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు: కలిశెట్టి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:48 PM
ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేదలకు మేలు జరిగిం దని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేదలకు మేలు జరిగిం దని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నా రు. కూటమి నాయకులతో కలిసి బుధవారం కోష్ట జంక్షన్‌లో దుకాణాన్ని సందర్శించారు. నిత్యావసర సరకులపై జీఎస్‌టీ స్లాబ్‌లు తగ్గించటం వల్ల ప్రతి కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పిషిని జగన్నాఽథం నాయుడు, లంక శ్యామలరావు, పిన్నింటి భానోజినాయుడు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఉపయోగం: శంకర్
గార, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కళింగపట్నంలో జీఎస్టీ రేట్ల తగ్గింపుపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రూపొందించిన సైకత శిల్పాన్ని ఎమ్మె ల్యే శంకర్ ఆవిష్కరించారు. జీఎస్సీ తగ్గింపుతో సామాన్యు లకు ఊరట కలిగిందన్నారు.
మత్య్సకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నా రు. బుధవారం మొగదలపాడు, శ్రీకూర్మం, బలరాంపురం గ్రామాల్లో మత్స్యకారులకు నైలాన్ వలలు, బోట్ల ఇంజన్లు పంపిణీ చేశారు. పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.