జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు గొప్ప కానుక
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:25 PM
జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు ఎంతో ఊరట కలిగించిందని బీజేపీ జిల్లా అధ్య క్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు.
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు ఎంతో ఊరట కలిగించిందని బీజేపీ జిల్లా అధ్య క్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం అరసవల్లి మిల్లు జంక్షన్‌లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకు రాలు శవ్వాన ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కటౌ ట్లకు క్షీరాభిషేకం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టు కున్నారన్నారు. కోట్లాది మంది మధ్య తరగతి ప్రజలకు దసరా, దీపావళి కానుక అంద జేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పైడి సింధూర, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.