Share News

జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:47 PM

: కూటమి ప్రభుత్వం జీఎస్టీతగ్గింపు, మినహాయింపులతో పేద,బడుగు, బలహీన వర్గా లకు మేలు జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి తెలిపారు.

జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు

కొత్తూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం జీఎస్టీతగ్గింపు, మినహాయింపులతో పేద,బడుగు, బలహీన వర్గా లకు మేలు జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి తెలిపారు. సోమవారం కొత్తూరులో విలేక రులతో మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపువల్ల పేదలు వినియోగించే నిత్యవసరసరుకులు ధరలుతగ్గుతాయని తెలిపారు.ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం దేశం ఆర్థికాభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు.

జీఎస్టీ తగ్గింపుపై అవగాహన తప్పనిసరి

కాశీబుగ్గ,సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):వస్తుసేవల పన్ను(జీఎస్టీ) మంగళవారం నుం చి తగ్గించనుండడంతో వినియోగదారులకు అవగాహన తప్పనిసరి అని వినియోగదా రుల సంఘాల సమాఖ్య రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ ఎల్‌. వెంకటాచలం సోమవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.మధ్య తరగతి వినియోగదారులు కొనుగోలు చేసే 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గించడం వినియోగదారులకు కొంత ఊరట లభించిందని తెలిపారు. అధికారుల పర్యవేక్షించి వినియోగదారులకు బాసటగా నిలవాలని కోరారు.

Updated Date - Sep 22 , 2025 | 11:47 PM