జీఎస్టీ తగ్గింపుతో అన్నివర్గాలకూ మేలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:54 PM
నిత్యావసర వస్తువులపై గతంలో 18 శాతం ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించడంతో అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందని టీడీపీ మండలాధ్యక్షులు కత్తిరి వెంకటరమణ తెలిపారు.
జలుమూరు, (సారవకోట) అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువులపై గతంలో 18 శాతం ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించడంతో అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందని టీడీపీ మండలాధ్యక్షులు కత్తిరి వెంకటరమణ తెలిపారు. సారవకోట మండలంలోని చిన్నగుజ్జువాడ, కోదడ్డపనస, బద్రి, గుమ్మపాడు గ్రామాల్లో సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా తగ్గిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, భాస్కరరావు పాల్గొన్నారు.