Share News

జీఎస్ట్టీ 2.0తో సామాన్యులకు మేలు: శంకర్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:42 PM

సూపర్‌ జీఎస్టీ 2.0తో ఎలకా్ట్రనిక్స్‌, ఇతర వస్తువుల ధరలు తగ్గి సామా న్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

జీఎస్ట్టీ 2.0తో సామాన్యులకు మేలు: శంకర్‌
నరసన్నపేట: ఎలకా్ట్రనిక్‌ వస్తువుల ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

అరసవల్లి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సూపర్‌ జీఎస్టీ 2.0తో ఎలకా్ట్రనిక్స్‌, ఇతర వస్తువుల ధరలు తగ్గి సామా న్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఎలకా్ట్రనిక్స్‌ వస్తువుల ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్స్‌ను జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ స్వప్నదేవితో కలిసి ప్రారంభించారు. ఈనెల 13వ తేదీ నుంచి 19 వరకు నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ పాఠశాల మైదా నంలో నిర్వహించనున్న సిక్కోలు ఉత్సవ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఏడీ రఘునాథ్‌, జిల్లా జీఎస్టీ అధికారి చంద్రకళ, చౌదరి పురుషోత్తమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో ఊరట: బగ్గు

నరసన్నపేట, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట కలిగిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక జట్టు కళాసీ యూనియన్‌ భవనం వద్ద సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎలక్ర్టానిక్‌ వస్తువుల గ్రాండ్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నేతలు బగ్గు అర్చన, దామోదరం నర్సింహం, శిమ్మ చంద్రశేఖర్‌, గొద్దు చిట్టిబాబు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.

విస్తృత ప్రచారం చేయాలి: ఎంజీఆర్‌

పాతపట్నం అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జీఎస్‌టీ 2.0 అమలుపై విస్తృతస్థాయి ప్రచారం చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌లో భాగంగా స్థానిక కేఎస్‌ఎం ప్లాజాలో ఎల కా్ట్రనిక్స్‌, హోం అప్లియెన్సెస్‌ ప్రదర్శనను శుక్రవారం నిర్వ హించారు. కార్యక్రమంలో జీఎస్టీవో శ్రీనివాసరావు, ఎంపీ డీవో హెచ్‌.వెంకటరమణమూర్తి, టీడీపీ మండల, పట్ట ణాధ్యక్షులు పైల బాబ్జీ సైలాడ సతీష్‌, మార్కండే యులు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకత పాటించాలి

ఎచ్చెర్ల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ చెల్లింపులో పారదర్శకత పాటించి దేశాభివృద్ధికి సహకరించా లని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం (విశాఖ పట్నం) డాక్టర్‌ కేవీ మోహనరావు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం సూపర్‌ జీఎస్టీ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:42 PM