ఆదాయం వచ్చే పంటలను సాగు చేయండి
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:59 PM
పెట్టుబడి తక్కువ.. ఆదాయ ఎక్కువగా వచ్చే పంటలను రైతులు సాగు చేసుకోవాలని కృషివిజ్జాన కేంద్రం శాస్త్రవేత్త వి.హరికుమార్ సూచించారు.
పోలాకి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడి తక్కువ.. ఆదాయ ఎక్కువగా వచ్చే పంటలను రైతులు సాగు చేసుకోవాలని కృషివిజ్జాన కేంద్రం శాస్త్రవేత్త వి.హరికుమార్ సూచించారు. ఆదివారం ఈదులవలసలో వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొబ్బరి, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులతో వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ఉద్యానవన అధికారి కె.సునీత, సీహెచ్.ఢిల్లీశ్వరరావు, వ్యవసాయ విస్తరణాధికారులు వెంకటే్‌ష్, కంచు రఘువర్మ పాల్గొన్నారు.