విద్యుదాఘాతంతో కిరాణా షాప్ దగ్ధం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:39 PM
వెలగాడ గ్రామ ప్రధాన వీధిలో ఉన్న కిరాణా దుకాణం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుదాఘాతంలో దగ్ధమైంది.
జి.సిగడాం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): వెలగాడ గ్రామ ప్రధాన వీధిలో ఉన్న కిరాణా దుకాణం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుదాఘాతంలో దగ్ధమైంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చింతపల్లి రమేష్ కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటు న్నాడు. అయితే విద్యుదాఘాతమై షాపులో ఉన్న నిత్యావసర సరుకులు, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, డ్రింక్ బాటిల్స్, రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్, కరెంటు మీటరు, సదరం సర్టిఫికేట్ ఇతర వస్తువులతో పాటు సుమారు రూ.10 వేల నగదు కాలిపోయాయి. మొత్తం రూ.2 లక్షలు ఉంటుం దని అంచనా వేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. రమేష్ ఆరేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయాడు. కిరాణా షాపు పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకువస్తున్నానని, అగ్ని ప్రమాదంతో ఉపాధి కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న వీఆర్వో నీలకంఠం, వీఆర్‌ఏ ఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.