ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:17 AM
జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నియోజకవర్గం కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
పలాస, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నియోజకవర్గం కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు తెలిపారు. శనివా రం పలాస టీడీపీ కార్యాలయం లో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతినెలా నిర్వహించే గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులు సత్వ రమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. పలాస నియోజ కవర్గంలో నెలలో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని, ఇక్కడున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మునిసిపాలిటీకి తన నిధులు రూ.కోటి కేటాయించామని, పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయని చెప్పారు. కాశీబుగ్గ ఫ్లైఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ రూ.48 కోట్లు మంజూరు చేయడంతో పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. తాళభద్ర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి కూడా మోక్షం కలుగుతుందని, ఇందుకు సంబంఽ దించిన ప్రతిపాదనలు రైల్వేమంత్రిత్వశాఖ వద్ద ఉన్నాయని చెప్పారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతులు..
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతులు లభించాయని, స్థల సేకరణ పూర్తయితే నిర్మాణం జరుగుతుందని, ప్రజలు అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. జీడి, కొబ్బరి రైతు ల సమస్యలు పరిష్కరి స్తామని, జీడి పరిశో ధన కేంద్రం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నా మని, స్థలం కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు.అనంతరం పలాసనియోజక వర్గం నలుమూలలనుంచి వచ్చినవారు తమ సమ స్యలపై వినతిపత్రాలు అందజేశారు. వినతుల నునమోదుచేసుకొని పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వర రావుయాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, టంకాల రవిశంకర్‌గుప్తా, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలి కృష్ణారావు, ఎ.రామకృష్ణ పాల్గొన్నారు.