కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయండి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:59 PM
ఇచ్ఛాపురం నియోజకవర్గం నాలుగు మండలాల్లో సుమారు 400 మంది ఒడ్డి కులస్థులున్నామని, కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామని, తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఒడ్డి కులస్థులు వేడుకున్నారు.
ఎమ్మెల్యే అశోక్ కు ఒడ్డి కులస్థుల వినతి
ఇచ్ఛాపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గం నాలుగు మండలాల్లో సుమారు 400 మంది ఒడ్డి కులస్థులున్నామని, కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామని, తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఒడ్డి కులస్థులు వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను రామయ్యపుట్టుగలో కలిసి వినతి పత్రం అందించి సమస్యలను విన్నవించారు. జిల్లాలో ఇతర నియో జకవర్గాల్లో ఒడ్డి కులస్థులకు బీసీ-ఎ ధ్రువీకరణ పత్రాలిస్తున్నారని, ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తగు న్యాయం చేసేలా చర్యలు తీసు కుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ లోనూ వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బృందా వన్ పండిత్, మరళీ పండిత్, ఉపాధ్య క్షుడు శివప్రసాద్ పండిత్, అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షు రాలు బి.హైమా వతి, టీడీపీ నేత కొరాయి ధర్మరాజు పాల్గొన్నారు.