నాన్నమ్మపై మనుమల దాడి
ABN , Publish Date - May 30 , 2025 | 11:49 PM
నాన్నమ్మపై మనుమడు, మనుమరాలు దాడి చేసిన ఘటన శుక్రవారం శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం క్రైం, మే 30(ఆంధ్రజ్యోతి): నాన్నమ్మపై మనుమడు, మను మరాలు దాడి చేసిన ఘటన శుక్రవారం శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని పీఎన్ కాలనీ నాయుడుచెరువు గట్టు వద్ద టి.రమణమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. పక్కనే ఉంటున్న కుమారుడి పిల్లలైన మనుమడు, మనుమరాలితో బాతురూమ్ నీరు బయటకు వస్తుండడంతో వారిని నిల దీసింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారిరు వురు రమణమ్మపై దాడికి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.
మోసగించాడంటూ బాధితురాలి ఫిర్యాదు
గార, మే 30(ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని చెప్పి బందరు వానిపేటకు చెందిన ఎస్.అనిల్ (23) మోసగించాడని మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్టు ఏఎస్‌ఐ ఎం.చిరంజీవి తెలిపారు. తనను నమ్మించి మోసం చేసి నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఆటో డ్రైవర్‌కు గాయాలు
ఎచ్చెర్ల, మే 30(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం జంక్షన్‌కు సమీపంలో జాతీ య రహదారిపై గురువారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జి. సిగడాం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎరుగంటి మధు శ్రీకాకుళం నుంచి జి.సిగడాం వెళ్తుండగా.. చిలకపాలెం జంక్షన్‌కు సమీపంలో హైవే పై తన ఆటోను పరిశీలిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన మధు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఎచ్చెర్ల పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.