ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:05 AM
రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధ్దం చేసిన ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష పేర్కొన్నారు. సోమవారం జలుమూరు వద్ద సిద్ధం చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.
జలుమూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధ్దం చేసిన ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష పేర్కొన్నారు. సోమవారం జలుమూరు వద్ద సిద్ధం చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యాన్ని మిల్లులకు పంపిం చే సమయంలో ట్రక్కు షీటు జనరేటుచేసి పంపించాలని అధికారులకు ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు భారినుంచి ధాన్యాన్ని కాపాడడానికి టార్పాలిన్లు వాడుకోవాలని రైతులకు సూచించారు. శ్రీకాకుళం డివిజన్‌లో ఇప్పటివరకు మూడు వేలు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని మిల్లులకు పంపించినపుడు మిల్లర్లు ఐదారు కేజీలు ధాన్యం అదనంగా అడుగుతున్నారని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకురాగాఅటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట తహసీల్దారు జన్ని రామారావు ఉన్నారు.
గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు
పాతపట్నం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు ఏవో కె.సింహాచలం తెలిపారు. దిత్వా ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రైతాంగం అధైౖర్యపడొద్దని చెప్పారు. సోమవారం మండలంలోని రొంపివలస, నల్లకొత్తూరు, ఆర్‌ఎల్‌పురం, నల్లబొంతు, ఎఎస్‌కవిటి తదితర గ్రామాలను సందర్శించారు. బైదలా పరంలోని కిషన్ మోడరన్ రైస్‌మిల్లును సందర్శించి కొనుగోలు వచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించారు.