గ్రేడ్-2 జేఎల్‌ఎంలను రెగ్యులర్ చేయాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:36 PM
గ్రేడు-2 జెఎల్‌ఎం లను, కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని విద్యుత్ సిబ్బంది డిమాండ్‌చేశారు. సోమవారం చల్లవానిపేట, సారవకోట సబ్‌స్టేషన్ల ఎదుట అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని జేఏసీ పిలుపు మేరకు 1104 యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
జలుమూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రేడు-2 జెఎల్‌ఎం లను, కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని విద్యుత్ సిబ్బంది డిమాండ్‌చేశారు. సోమవారం చల్లవానిపేట, సారవకోట సబ్‌స్టేషన్ల ఎదుట అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని జేఏసీ పిలుపు మేరకు 1104 యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి నుంచి ఆగస్టు 2004 వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సెక్షన్ ఏఈ ఎం.సూర్యారావు, జేఈ జ్ఞానేశ్వరి, లైనుమేన్‌లు ఎం.సంజీవి, పి.కాంతారావ పాల్గొన్నారు.
ఫహిరమండలం,సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించా లని విద్యుత్ ఉద్యోగులు హిరమండలంలోని సబ్‌స్టేషన్‌వద్ద నల్లబ్యాడ్జిల తో విధులకు హాజరయ్యారు.