రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా గోవిందరాజులు
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:56 PM
రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా కోటబొమ్మా ళి మేజర్ పంచాయతీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయుడు బోయిన గోవిందరాజులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోటబొమ్మాళి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా కోటబొమ్మా ళి మేజర్ పంచాయతీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయుడు బోయిన గోవిందరాజులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాడు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు హయాం నుంచి ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కళింగ కోమట్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహనా యుడు, అచ్చెన్నాయుడులకు గోవిందరాజులు కృతజ్ఞతలు తెలిపారు.