రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:59 PM
విపత్తుల నుంచి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలయ్యాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): విపత్తుల నుంచి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమ య్యాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. బుధవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని విమ ర్శించారు. మొంథా తుఫాన్ వల్ల రైతులు పంటలను నష్టపోతే రూ.5 వేలు నామమాత్రంగా పరి హారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయ మన్నారు. కష్టాల్లో ఉన్న రైతు లను అదుకోవడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. 2004లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణమాఫీ చేసి ఆదుకుందని, ఎప్పు డూ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అన్నారు.