ఆఫ్‌షోర్ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:14 AM
ఆఫ్‌షోర్ ప్రాజె క్టు నిర్వాసితులకు అండగా కూట మి ప్రభుత్వం నిలుస్తుందని ఎ మ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస రూరల్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్ ప్రాజె క్టు నిర్వాసితులకు అండగా కూట మి ప్రభుత్వం నిలుస్తుందని ఎ మ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రామ కృష్ణాపురం రెవెన్యూ పరిధి కోసంగి పురం వద్ద ఆఫ్‌షోర్ నిర్వాసితుల కోసం నిర్మించిన కాలనీలో బుధవా రం రూ.7.66 కోట్లతో సీసీ రోడ్ల ని ర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడా రు. 2014-19 సంవత్సరంలో టీడీపీ పాలనలో ప్రతిష్టాత్మకంగా ఆఫ్‌షోర్ నిర్మాణానికి శ్రీకారం చు ట్టామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వారికి ఆర్‌ఆర్ కాలనీలు ఏర్పాటు చేసి నివాసిత స్థలాలు అందజేశామన్నారు. తన తండ్రి గౌతు శివాజీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తన హ యాంలో అకుంఠిత దీక్ష చేపట్టి ప్రత్యేక దృష్టిసా రించి నిర్వాసితులకు న్యాయం చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలనీలో ఒక్క కంకర రాయి కూడా వేయకుండా నిర్వాసితులను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు, పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మ ణరావు, కార్యదర్శి దువ్వాడ సంతోష్, నాయకులు గురిటి సూర్యనారాయణ, ఎస్.రాంబాబు, పంచా యతీ అధికారి నర్సింహమూర్తి, నిర్వాసిత కాలనీ వాసులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయం
హరిపురం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గౌతు శిరీషా అన్నారు. రూ.కోటి 20లక్షలు ఐటీడీఏ నిధులతో మందస మండలం చీపి- బొందుకారి రోడ్డులో వంతెన, చీపి-బుడంబో రోడ్డులో వంతెన, బీటీ రోడ్డుకు నిర్మాణాలకు ఆమె బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. టీడీపీ నాయకులు బావన దుర్యోదన, సాలిన మాధవరావు, రుద్రయ్య, తమిరి భాస్కరరావు తదితరులు అధికారులు పాల్గొన్నారు.