ఉద్యాన పంటలకు ప్రభుత్వం చేయూత
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:04 AM
ఉద్యాన పంటలకు కూటమి ప్రభుత్వం చేయూతనిస్తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
లావేరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటలకు కూటమి ప్రభు త్వం చేయూతనిస్తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం పెదలింగాలవలసలో ఆయిల్‌పామ్ విస్తరణ మహో త్సవంలో భాగంగా రైతులకు ఉచితంగా ఆయిల్‌పామ్ మొక్కలను పంపి ణీ చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పతంజలి ఏజీఎం పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుతో ప్రస్తుత ధరలతో ఎకరానికి రూ.లక్ష వరకు నికర ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు లుకలాపు అప్పలనాయుడు, సర్పంచ్ లుకలాపు యశోద, డీడీహెచ్ లక్ష్మీనారాయణ, డీఎంవో ఆర్‌వీవీ ప్రసాద్, హెచ్‌వో అమరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.