రైతు సంక్షేమానికి ప్రభుత్వం సహకారం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:34 PM
రైతు సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బి.చిన్నబాబు, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదాన్ తెలిపారు.
కవిటి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బి.చిన్నబాబు, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదాన్ తెలిపారు. బుధవారం కవిటిలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధులను రాష్ట్రప్రభుత్వం జమచేయడంతో టీడీపీ నాయకుల ఆధ్యర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మండలాధ్యక్షుడు పి.కృష్ణారావు ఆధ్వర్యంలోలో జరిగిన కార్యక్రమంలో నాయకులు బి.రమేష్, ఎస్‌వీరమణ, పి.సంతోష్, ఎ.మధు, బి.కామరాజు, వి.రంగారావు, బి.చక్రదర్, మణిబాబు పాల్గొన్నారు.