ఆపదలో ఉన్నవారికి అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:30 PM
అనారోగ్యం బారి న పడి కష్టకాలంలో ఉన్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
జి.సిగడాం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం బారి న పడి కష్టకాలంలో ఉన్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నారు. సోమవారం బాతువలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. బాతువ పీహెచ్‌సీ ని ఎమ్మెల్యే సందర్శించారు. వాండ్రంకి న్యూ బీసీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ పరామర్శించారు. అగ్ని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి బి.అనూష, కూటమి నాయకులు కుమరాపు రవి కుమార్, బూరాడ వెంకటరమణ, వజ్జపర్తి రఘురాం, భూపతి అర్జున్ కుమార్, సర్పంచ్‌లు కల్యాణి, సాకేటి నాగరాజు, బోగాది అప్పలనాయుడు, కె.వెంకటరావు పాల్గొన్నారు.
తోటపాలెంలో..
ఎచ్చెర్ల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): సీఎం రిలీఫ్ ఫండ్‌తో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. తోటపాలెం గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన ఆరు బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైౖర్మన్ చౌదరి అవినాష్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, కూటమి నేతలు విష్వక్సేన్, బెండు మల్లేశ్వరరావు, గూరు జగపతిబాబు, సంపతిరావు నాగేశ్వరరావు, గట్టెం శివరామ్ తదితరులు పాల్గొన్నారు.