చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం:ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:09 AM
చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్ గురువారం జరిగిన చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
అరసవల్లి/పాత శ్రీకాకుళం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్ గురువారం జరిగిన చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు నేతన్న భరోసాను రూ.24వేల నుంచి రూ.25 వేలకు పెంచారని, మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. చేనేత వస్త్రాలు ఇ కామర్స్ ద్వారా అమ్మేందుకు, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ రమేష్ కృష్ణ, హ్యాండ్లూమ్స్ ఏడీ టి.జనార్దన్ రావు, రెడ్ క్రాస్ సెక్రటరీ జగ న్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
గాంధీతోనే చేనేతకు ప్రాచుర్యం
పొందూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీతోనే చేనేత, ఖాదీవ స్త్రాలకు దేశంలో ప్రాచుర్యం లభించిందని ఎస్‌ఐ వి.సత్యనారాయణ, డీటీ శ్రీధర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సంద ర్భంగా గురువారం ఖాదీ వస్త్రాలయం సంస్థ సీనియర్ చేనేత కార్మికునికి నిర్వహించిన సన్మానం, గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం చేనేత కార్మికుడు చందన అప్పారావును దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఖాదీ వస్త్రాలయం అధినేతలు బి.ప్రతాప్, బి. కృష్ణారావు, జామి అనిల్ తదితరులు పాల్గొన్నారు.