Share News

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:05 AM

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథ కాలు అందించడం జరుగు తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
వినతులు స్వీకరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథ కాలు అందించడం జరుగు తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం నిమ్మాడలోని క్యాంపు కార్యా లయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి విన తులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్య లను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలున్నంత త్వరగా ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో వరి సాగు చేసేందుకు వంశధార కాలువ ద్వారా సాగునీరు విడిచిపెట్టాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్లు నిలుపుదల చేశారని, వాటిని పునరుద్ధరించాలని, నూతన గృహాలు, రోడ్లు మంజూరు చేయాలని ప్రజ లు వినతులు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:05 AM