క్రీడల్లో ప్రావీణ్యానికి ప్రభుత్వ చర్యలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:33 PM
విద్యార్థి దశ నుంచి క్రీడల్లో ప్రావీణ్యం పొందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వీటిని సద్వినియోగం చేసుకోవా లని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బెందాళం అశోక్ అన్నారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్
ఇచ్ఛాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి క్రీడల్లో ప్రావీణ్యం పొందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వీటిని సద్వినియోగం చేసుకోవా లని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బెందాళం అశోక్ అన్నారు. సురంగి రాజా మైదానంలో సోమవారం 76వ నియోజకవర్గస్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడా జెండాలను ఎగుర వేశారు. క్రీడల్లో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్ధాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. సురంగి రాజా క్రీడా మైదానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల నుంచి 750 మంది విద్యార్థు లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్య క్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్ రెడ్డి, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, డిప్యూటీ డీఈవో విలి యమ్స్, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, ఎంపీడీవో ప్రభాకర రావు, ఎంఈవోలు కె.అప్పారావు, ఎస్.విశ్వనాథం, ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.