Share News

లే అవుట్‌లో బయటపడ్డ ప్రభుత్వ భూమి

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:58 PM

ఇజ్ఞవరం పంచాయతీ నౌపడ రైల్వేగేట్‌ సమీపంలో నౌపడ-టెక్కలి మొయిన్‌ రోడ్డు పక్కన వేసిన లే అవుట్‌లో ప్రభుత్వ భూమి కలిపేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు.

లే అవుట్‌లో బయటపడ్డ ప్రభుత్వ భూమి

  • ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

సంతబొమ్ళాళి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇజ్ఞవరం పంచాయతీ నౌపడ రైల్వేగేట్‌ సమీపంలో నౌపడ-టెక్కలి మొయిన్‌ రోడ్డు పక్కన వేసిన లే అవుట్‌లో ప్రభుత్వ భూమి కలిపేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ ఆక్రమణపై ఇజ్ఞవరం రైతులు ఈ లే-అవుట్‌ వేసిన వ్యక్తిని ప్రశ్నించగా.. తాను టెక్కలి మాజీ ఎమ్మెల్యే మనుమ డనంటూ బెదిరింపులకు పాల్పడినట్టు అప్పటల్లో ఆ గ్రామ రైతులు తెలిపారు. వంశధార కాలువ కబ్జా చేయడంతో వరదనీరు ప్రవాహం ఆగిపోయి పంట పొలాలు ముంపునకు గురవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఈ ఏడాది జూలైలో ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో ‘వంశధార కాలువ కబ్జా’ శీర్షిక తో ప్రచురితమైన కథనంపై వంశధార, రెవెన్యూ అధికారులు పరిశీలించి తా త్కాలికంగా కాలువను పునరుద్ధరించారు. అనంతరం తహసీల్దార్‌ హేమసుం దరరావు ఆదేశాలతో సర్వేయర్‌ సుభాష్‌, ఆర్‌ఐ ప్రేమ్‌, వీఆర్వో జోగారావు సర్వే చేపట్టారు. ఆక్రమణలను గుర్తించి తహసీల్దార్‌కి నివేదిక అందజేశారు. దీనిపై టెక్కలికి చెందిన సీపాన అమ్మోజీబాబుకు నోటీసు జారీ చేశారు. నోటీసుకు స మాధానం వచ్చిన వెంటనే ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Sep 18 , 2025 | 11:58 PM