పలాస అభివృద్ధికి ప్రభుత్వం చొరవ: ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:56 PM
:పలాస అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం తీసు కుంటున్న చొరవకు కేంద్రీయ విద్యాలయం మంజూరుచేయడమే నిదర్శనమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
పలాస, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):పలాస అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం తీసు కుంటున్న చొరవకు కేంద్రీయ విద్యాలయం మంజూరుచేయడమే నిదర్శనమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిరీషను కలుసుకొని కేంద్రీయ విద్యా లయం మంజూరుకావడంపై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సైనికో ద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇళ్ల మన్మఽథరావు, కార్యదర్శి ఇప్పిలి తాతయ్య, సహా య కార్యదర్శి బమ్మిడి బాబూరావు, కోశాధికారి ఉప్పాడ వెంకటరావు పాల్గొన్నారు. అలాగే టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదులు స్వీకరించారు. కాగా నియోజకవర్గంలోని అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై శిరీష సమీక్షించారు. ఇప్పటివరకూ ఎన్ని బస్తాల యూరియా, డీఏపీ అందించారో నివేదిక ఇవ్వాలని కోరారు.